English   

సాహో...కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా 

 saaho ticket price hike
2019-08-29 12:14:48

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా సాహో. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 30న విడుదల కానుంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రోజుకు ఆరు ఆటలు ఆడేలా పర్మిషన్ ఇప్పించాలని నిర్మాణ సంస్థయిన యూవీ క్రియేషన్స్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. వారి విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. అంతే కాక టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, పెరిగిన రేట్లు ప్రధాన సెంటర్లలో రెండు వారాల పాటు, మిగతా సెంటర్లలో వారం పాటు అమలులో ఉండనున్నాయని ప్రచారం జరిగింది. అయితే దీని మీద వివాదం కావడంతో టికెట్ల ధరల పెంపు గురించి వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. సాహో సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశాయి. టికెట్ల ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం క్లారిటీ వచ్చింది. 

ఒక్కో సినిమా విషయంలో ఒక్కోలా వ్యవహరించలేమని చెప్పిన ప్రభుత్వ వర్గాలు, అన్ని సినిమాలు తమకు సమానమే అని తేల్చేశాయి. అయితే ఏపీ ప్రభుత్వం అదనపు షోస్ కయినా పర్మిషన్ ఇవ్వగా తెలంగాణా ప్రభుత్వం మాత్రం ఆ స్పెషల్ షోల కోసం కూడా పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని వార్తలొచ్చాయి. తొలి వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి వచ్చిందని చెప్పారు. కట్ చేస్తే.. అలాంటిదేమీ లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరలు, అదనపు షో లు వేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. సాహో సినిమా నిర్మాతల రిర్వెస్ట్ ని సున్నితంగా తిరస్కరించింది. అయితే సాహో సినిమా టికెట్ల ధర పెంపు వ్యవహారం కోర్టుకి చేరింది. సాహో సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని దర్శక నిర్మాత నట్టికుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. ముందు జాగ్రత్త పడిన ఏపీ ప్రభుత్వం తమ మీద తప్పు లేకుండా చూసుకుంది.

More Related Stories