English   

సాహో ఫీవర్...విపరీతమైన క్రేజ్ 

Saaho Craze
2019-08-29 12:45:10

ప్రభాస్ సాహో సినిమా కోసం కేవలం ఆయన అభిమానులే, కాదు తెలుగు ఇండస్ట్రీ మొత్తం కాదు కాదు, మొత్తం ఇండియన్ సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు. దానికి కారణం బాహుబలి సినిమాతో ప్రభాస్ తెచ్చుకున్న క్రేజ్. కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు అనే అంశాన్ని బాగా హైలైట్ చేయడంతో రెండో పార్ట్ మీద భీబత్సమైన అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల వలన బాహుబలి 2 ప్రపంచ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా తర్వాత జక్కన్న మరో సినిమా రిలీజ్ చేయలేదు, ప్రభాస్ కూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు. జక్కన్నకి మరో ఏడాది పైనే సమయం పడుతుంది. ఇక ప్రభాస్ ఈ ఆగష్టు 30న రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. దీంతో ఈ సినిమా మీద ఎక్కడ లేని క్రేజ్ నెలకొంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన సాహో పోస్టర్స్, ట్రైలర్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి. అసలు బాలీవుడ్ సినిమాలు కూడా బిత్తరపోయేలా ఉన్న విజువల్స్ ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెంచేశాయి. 

ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ అంతర్జాతీయంగా పేరుగాంచిన ఫార్స్‌ ఫిలిమ్స్‌ దక్కించుకుంది. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ తో విదేశీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ఫార్స్‌ ఫిలిమ్స్‌. హాలీవుడ్‌, బాలీవుడ్‌, అరబిక్‌, దక్షిణాది చిత్రాల పంపిణీలో ఈ సంస్థకు మంచి పేరుంది. అంతర్జాతీయ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ రూపొందించిన స్టంట్ సీన్స్ కోసం ప్రభాస్‌ అభిమానులు సహా ప్రపంచ సినిమా అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటిదాకా వెల వెలబోతున్న థియేటర్లన్నీ సాహో సినిమా కోసం రెడీ అయ్యాయి. పట్టణాలు సహా నగరాలూ అన్నిటిలో తొంభై శాతం పైగా ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఆంధ్రలో అయితే స్పెషల్ షోల టికెట్స్ ను ఊహకు కూడా అందని రేట్లకు అమ్మేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ షోలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాహో ఫీవర్ ఫుల్ గా అందుకుంది. ప్రతిచోటా ఎర్లీ హవర్స్ షోలు పడనున్నాయి. చూద్దాం రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఇంకెంత క్రేజ్ తెచ్చుకుంటుందో. 

More Related Stories