English   

హరీష్ కల నేరవేరిందట 

 Harish shankar
2019-08-29 15:06:26

మెగా హీరో వ‌రుణ్ తేజ్, పూజా హెగ్దే లీడ్ రోల్స్ లో హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘వాల్మీకి’. తమిళ హిట్ సినిమా జిగార్తాండాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే సింహ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేసుకుంటోంది. వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా, తమిళ నటుడు అధర్వ మురళి రచయితగా నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 13న రిలీజ్‌ అవుతుందని భావించినా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సూచనతో 20న విడుద‌ల చేయాల‌ని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. తాజాగా ఈ సినిమా దర్శకుడు హరీశ్ తన కల నెరవేరిందని అంటున్నారు.  ‘గోదావరి తీరంలో కాదు .. గోదావరి నదిలోనే షూటింగ్ జరుపుతున్నాము. 

గోదావరిలో షూటింగ్ చేయాలనే నా కల ఇప్పటికి నిజమైందని హరీశ్ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఆ నదిలో దిగిన ఓ సెల్ఫీని కూడా డైరెక్టర్ పోస్ట్ చేశాడు. ఇక ఈ సినిమా నుండి పూజా హెగ్డే పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ పోస్టర్‌ లో పూజా అప్పియరెన్స్ చూస్తుంటే -పల్లె యువతి పాత్ర పోషించి ఉండొచ్చని అర్థమవుతోంది. ట్విట్టర్ అకౌంట్‌లో తనను తాను ‘శ్రీదేవి’గా ఇప్పటికే ఇంట్రొడ్యూస్ చేసుకుంది పూజ. మోడ్రన్ డ్రెస్సుల్లో పూర్తి గ్లామర్ రోల్స్‌కే పరిమితమైన ఈ బ్యూటీకి, వాల్మీకి క్యారెక్టర్ ఒక మంచి రోల్ అనే చెప్పాలి. ఇంతకుముందు ‘ముకుంద’ చిత్రంలో వరుణ్ సరసన నటించినా పెద్దగ కెమిస్ట్రీ పండించని పూజ, ఈ వాల్మీకిలో ఏమేర పందిస్తుందో చూడాలి. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

More Related Stories