English   

అల్లు అర్జున్ కార్ కొన్నాడు.. శ్రీ రెడ్డి కారు కూతలు కూసేసింది.. 

 Allu Arjun
2019-08-29 17:15:03

తెలుగులో మోస్ట్ గెలికింగ్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో ఆలోచన లేకుండా శ్రీ రెడ్డి అని చెప్పాల్సిందే. ఎందుకో తెలియదు కానీ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిపై నోరు పారేసుకుంటూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈమె చూపులు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై పడ్డాయి. ఆయన ఈ మధ్యే కార్ కొన్నాడు. దాంతో ఇప్పుడు శ్రీరెడ్డికి కాలిపోయింది. అసలు కార్ ఎందుకు కొన్నావ్ అని అనకుండానే అనేసింది ఈ భామ. ఓ వైపు కార్ కొన్నందుకు కంగ్రాట్స్ చెప్తూనే మరోవైపు సెటైర్లు కూడా వేసింది ఈ బ్యూటీ. బీస్ట్ అనే పేరు కూడా పెట్టుకున్నాడు బన్నీ తన కార్ కు. కోట్లు పెట్టి కొన్న ఈ కార్ ను ప్రేక్షకులకు కూడా పరిచయం చేసాడు ఈయన. అయితే బన్నీ కార్ కొనడంపై ఇప్పుడు శ్రీ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేసింది. కోట్లు విలువచేసే కారవాన్, రేంజ్ రోవర్ కార్లను కొన్నావు కాని.. కేరళ వరద బాధితులకు ఎంత సాయం చేశావ్.. అక్కడ నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా.. నువ్ వాళ్లకు హెల్ప్ చేస్తావని భావిస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పట్ల బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమ హీరో ఏం చేస్తున్నాడో తమకు తెలుసు అని.. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంటూ శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. 2018 ఆగస్టులో కేరళలో భారీ వరదలు వస్తే 25 లక్షలు సాయం చేసిన విషయాన్నీ శ్రీ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి ఇప్పుడేం చేస్తాడో చూడాలిక.

More Related Stories