English   

సాహోలో ప్రభాస్ డబుల్ రోల్.. రివీల్ అయిన అతిపెద్ద ట్విస్ట్.. 

Prabhas
2019-08-29 17:48:11

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. ఇక ఈ చిత్ర కథ ఎలా ఉండబోతుందా.. సినిమా ఎలా ఉండబోతుందా అని వాళ్లు కూడా వేచి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు తెలుస్తున్న వివరాలను బట్టి చూస్తుంటే ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కథ ప్రకారం మొదట్లోనే 2000 కోట్ల దొంగతనం జరుగుతుంది. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ దొంగతనం ఎవరు చేశారనేది పోలీసులకు ఓ మిస్టరీగా మారుతుంది. అలాంటి సమయంలో ఈ కేసు విషయంలో ఛార్జ్ తీసుకుంటాడు అశోక్ చక్రవర్తి(ప్రభాస్). ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ దొంగతనం చేసేది కూడా ప్రభాసే. ఓ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అన్ని వేల కోట్లు దొంగతనం చేయాల్సి వచ్చిందనేది ఫ్లాష్‌బ్యాక్‌లో దర్శకుడు స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం చేసాడని తెలుస్తుంది. ఈ కేసులో శ్రద్ధా కపూర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. ముందు ప్రభాస్ ను అపార్ధం చేసుకున్నా ఆ తర్వాత ప్రేమిస్తుందని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ తండ్రి శాస్త్రవేత్త.. ఒక అధునాతన జెట్‌ ప్యాక్‌ను ఆయన తయారు చేస్తాడు.. టీజర్ లో ఇది చూపించాడు దర్శకుడు. దానికి సంబంధించిన రహస్యాలు ఓ బ్లాక్ బాక్స్‌లో ఉంటాయి. అసలు ఆ బ్లాక్ బాక్స్‌కు.. రెండు వేల కోట్ల దొంగతనానికి మధ్య సంబంధం ఏమిటి అనేది మిగతా కథ అంటున్నారు. ఇక ఇందులో ప్రభాస్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడనే టాక్ కూడా నడుస్తోంది. ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇది నిజమా కాదా అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది.

More Related Stories