English   

ప్రభాస్ మల్టీప్లెక్స్ ఓపెన్ చేసిన చరణ్...పెట్టుబడులు నిజమేనా ?

prab
2019-08-29 20:30:49

దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో నిర్మించిన మల్టీప్లెక్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ కలిసి దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌ తో కూడిన థియేటర్‌ ను నిర్మించిన విషయం తెలిసిందే. సాహో సినిమాని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థకు చెందిన ‘వి సెల్యులాయిడ్’ పేరిట ఈ మల్టీప్లెక్స్‌ నిర్మించబడింది. ‘వి ఎపిక్’ పేరుతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో పిండిపాళెం వద్ద చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పక్కన ఉంది. రూ.40 కోట్ల వ్యయంతో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. ప్రభాస్  సాహో సినిమాతో వి ఎపిక్ మల్టీప్లెక్స్‌‌లో ప్రదర్శనలు మొదలుకానున్నాయి.

యూవీ క్రియేషన్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌‌కు షేర్ ఉండగా, ఈ సాహో సినిమాకి చరణ్ పెట్టుబడి పెట్టాడని చెబుతున్నారు, అందుకే ఆయన ఈ మల్టీ ప్లెక్స్ ఓపెనింగ్ చేసినట్టు చెబుతున్నారు. ఇక ఈ థియేటర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 106 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన స్క్రీన్‌తో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. ఈ థియేటర్‌లో 656 సీట్ల సామర్థ్యం ఉంది. దీనిని బాహుబలి థియేటర్ అని అంటున్నారు. 3డీ సౌండ్‌ సిస్టమ్‌ ఈ థియేటర్‌ ప్రత్యేకత. మొత్తం మూడు స్క్రీన్ లలో రెండు స్ర్కీన్‌లు  మాములువే అది సైజ్ లో కానీ టెక్నాలజీ పరంగా మాత్రం బిగ్ స్ర్కీన్ తో సమానవైనవే. వీటి సీటింగ్ కెపాసిటి ఒక్కో దానికి 140సీట్లు. ఇక ఈ థియేటర్ ఆసియాలో రెండో అతి పెద్ద థియేటర్‌ అని చెబుతున్నారు. 

More Related Stories