English   

మంచు విష్ణు మూడో కూతురి పేరు విన్నారా ?

vishnu
2019-08-29 21:28:55

మంచు విష్ణు నాలుగో బిడ్డకి తండ్రి అయ్యాడన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇరవై రోజుల క్రితం మంచు విష్ణు భార్య విరానికా ఓ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. గతంలో వారికి ఇద్దరు కవల ఆడపిల్లలు, ఓ బాబు ఉన్నారు. మూడోసారి ముచ్చటగా మహాలక్ష్మికి జన్మనిచ్చింది మంచు విరానికా. శ్రావణ శుక్రవారం రోజు పండంటి ఆడపిల్ల రావడంతో మంచు కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఇక తాజాగా విష్ణు తన చిన్న కుమార్తెకు పేరు పెట్టాడు. తన కుమర్తె పేరు ఆర్య విద్య అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. చిన్ని పూలతోట్టే లాంటి దానిలో పడుకోబెట్టి ఉన్న ఆ చిన్నదాని పిక్ ని మంచు విష్ణు షేర్ చేశాడు. పేరు చాలా బావుందంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆర్య విద్యతో కలసి మొత్తం మంచు కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు ఉన్నట్టే. మంచు విష్ణుకు ఇప్పటికే ఇద్దరు కవలలు ఉండగా మంచు లక్ష్మి సరోగసీ ద్వారా ఓ ఆడబిడ్డను కన్నారు. విష్ణు ఆడపిల్లల పేర్లు అరియానా విరియానా కాగా కొడుకు పేరు అవ్రమ్ భక్త.  

More Related Stories