English   

సాహో సినిమా ఫస్ట్ టాక్.. ముంబైలో ప్రీమియర్ షో..

Images.jpeg
2019-08-30 07:53:29

సాహో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. అయితే ఇక్కడ ప్రీమియర్ షోలు పడకపోయినా కూడా ముంబైలో మాత్రం ప్రీమియర్ పడిందని తెలుస్తుంది. అక్కడ్నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం సాహోకు అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ప్రభాస్ మరోసారి ఈ చిత్రంతో బాలీవుడ్ లో సంచలనం సృష్టించడం ఖాయం అని తెలుస్తుంది. కచ్చితంగా సినిమా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడనటువంటి బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందంటున్నారు ఫ్యాన్స్. సినిమా చూసిన వాళ్లు కూడా అదిరిపోయిందని చెబుతుంటే నిర్మాతలు కూడా సంతోషంలో మునిగిపోయారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ ఇండియన్ స్క్రీన్ పై ఇదివరకు చూడనట్లు ఉన్నాయంటున్నారు. ఏదేమైనా ఈ పాజిటివ్ టాక్ విన్న తర్వాత ప్రభాస్ అభిమానులు కూడా గాల్లో తేలిపోతున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ ను దున్నేయడం ఖాయంగా కనిపిస్తుంది.

More Related Stories