English   

చివరికి రాజమౌళి సెంటిమెంట్ నిజమైపోయేలా ఉందిగా.. 

 Rajamouli
2019-08-30 18:36:55

తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోకు అంత త్వరగా మరో హిట్ రాదని. ఆయన ఏ హీరోతో పని చేస్తే అప్పటికి ఆ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇస్తాడు. కానీ ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. ఇప్పటి వరకు ఈయన చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్టే. కానీ ఆ సినిమాల తర్వాత ఆ హీరోల పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోతుంది. రాజమౌళి సినిమాల తర్వాత హీరోలకు హిట్లు రావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం మారట్లేదు. ఇప్పుడు సాహో విషయంలో కూడా ఇదే జరుగుతుందని అర్థమవుతుంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ప్రభాస్ సినిమాకు ఎలాంటి గతి పట్టబోతుందో అర్థం చేసుకోవచ్చు కూడా. ఇప్పటికే టాక్ దారుణంగా ఉండటంతో సినిమా కలెక్షన్లు కూడా రాను రాను క్రమంగా పడిపోవడం ఖాయం. ఇదే జరిగితే రాజమౌళి తర్వాత సినిమా హీరో చేసిన సినిమా మరోసారి పోయినట్లే. బాహుబలితో ఆకాశానికి చేరిపోయిన ప్రభాస్ ఇమేజ్ ఇప్పుడు పాతాళానికి పడిపోయేలా కనిపిస్తుంది. సాహోతో బడ్జెట్ చూసుకున్నాడు కానీ కథ చూసుకోకుండా కాలు ముందుకు వేసాడు ప్రభాస్. తీరా వేసిన తర్వాత ఇప్పుడు తెలిసింది అది పెద్ద గొయ్యి అని. ఇప్పుడు కానీ సాహో వర్కవుట్ కాలేదంటే మరోసారి రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ వర్కవుట్ అయినట్లే. స్టూడెంట్ నెం 1 తర్వాత సుబ్బు.. సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా.. సై తర్వాత శ్రీ ఆంజనేయం.. చత్రపతి తర్వాత చక్రం.. విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్.. యమదొంగ తర్వాత కంత్రి.. మగధీర తర్వాత ఆరెంజ్.. మర్యాద రామన్న తర్వాత అప్పల్రాజు.. ఈగ తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసు.. ఇప్పుడు బాహుబలి తర్వాత సాహో.. ఎక్కడా చరిత్ర అయితే మారలేదు.

More Related Stories