English   

సాహో ఫస్ట్ డే కలెక్షన్ ఎంత

Images.jpeg
2019-08-31 07:17:00

ప్రభాస్ అభిమానులతో పాటు ఇప్పుడు ట్రేడ్ వర్గాలు కూడా ఇదే లెక్కలేసుకుంటున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చుంటే రెండు మూడు రోజుల్లో కూడా రికార్డులు బద్దలైపోయేవి. కానీ ఊహించని విధంగా ఈ చిత్రానికి టాక్ తేడాగా వచ్చేసింది. యాక్షన్ ప్రియులకు కాకుండా మామూలు ప్రేక్షకులకు కూడా సాహో పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. యాక్షన్ ఎంజాయ్ చేసే వాళ్లు కూడా కేవలం సీన్స్ వరకు మాత్రమే బాగుందంటున్నారు కానీ సినిమా మాత్రం కాదు. దాంతో దర్శక నిర్మాతలతో పాటు బయ్యర్లకు కూడా ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ఎంత కలెక్ట్ చేస్తుంది.. సేఫ్ జోన్ కు వస్తుందా రాదా అనే భయం అయితే వాళ్లలో కనిపిస్తుంది. భారీ సినిమాలు గాడి తప్పినపుడు ఉండే బాధ మామూలుగా ఉండదు. పైగా బయ్యర్లకు అది గునపం పోటే. ఇప్పుడు సాహో విషయంలో ఇదే జరుగబోతుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రం తొలిరోజే 100 కోట్ల వరకు వసూలు చేస్తుందని ముందు నుంచి అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు అది జరుగుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే తెలుగులో రికార్డ్ ఓపెనింగ్స్ ఖాయం.. ఎందుకంటే ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు. హిందీలో కూడా బాహుబలి పుణ్యమా అని గ్రాండ్ గానే ఓపెన్ అయింది. కానీ నెగిటివ్ రివ్యూస్ కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి తొలిరోజు 80 కోట్ల వరకు రావచ్చంటున్నారు ట్రేడ్ పండితులు. కానీ రెండు మూడు రోజుల పరిస్థితి తలుచుకుంటేనే బయ్యర్లకు భయం తప్పడం లేదు. మరి చూడాలిక.. ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయో..?

More Related Stories