English   

సాహో’కు పైరసీ షాక్.. ఫస్ట్ షో కంటే ఆన్ లైన్ లో దర్శనం..

leak
2019-08-31 07:56:32

ఒకటి రెండు రోజులు ఆగితే అయినా పరిస్థితి మరోలా ఉంటుందేమో కానీ.. బయట టికెట్స్ కోసం అభిమానులు కొట్టుకుంటుంటే.. ఆన్ లైన్ లో అప్పుడే పైరసీ రావడం కంటే దారుణం మరోటి ఉండదు. ఇప్పుడు సాహో విషయంలో ఇదే జరుగుతుంది. ఈ చిత్రం అప్పుడే ఆన్ లైన్ లో కనిపించడం నిర్మాతలకు రక్తకన్నీరు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా బయ్యర్ల పరిస్థితి తులచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చుంటే పైరసీ వచ్చినా కూడా పెద్దగా ప్రభావం పడేది కాదు. కానీ సినిమాకు టాక్ నెగిటివ్ వచ్చింది.. ఓపెనింగ్స్ కూడా తొలిరోజు తర్వాత ఎలా ఉంటాయో అంచనా వేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పైరసీ రావడం దారుణం అనిపిస్తుంది. కొన్ని వెబ్ సైట్లు అయితే పగలు రాత్రి నిద్ర కూడా మానుకుని ఈ కొత్త సినిమాల కోసమే వేచి చూస్తున్నాయి. పెద్ద సినిమాలు విడుదల కాగానే కనీసం ఫస్ట్ షో కూడా పడకముందే వాళ్ల సైట్లో పెట్టేస్తున్నారు. రివ్యూ కంటే ఫాస్టుగా ఆన్ లైన్ పైరసీ రావడంతో కొందరు పైరసీ ప్రియులు ఇదే అదునుగా డౌన్ లోడ్ చేసుకుని సినిమా ఇంట్లోనే చూస్తున్నారు. ఇది నిజంగానే నిర్మాతలకు కొంప ముందే యవ్వారం. దీనిపై ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నా కూడా సైబర్ నేరగాళ్లు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తమిళ్ రాకర్స్‌తో పాటు మరికొన్ని సైట్లలో ఇప్పటికే సాహో దర్శనమిస్తుంది. దాంతో దర్శక నిర్మాతలకు భయం పట్టుకుంది. మరి ఇది సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాలి.

More Related Stories