English   

సాహో మీద సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి...కాపీ క్యాట్ అంటూ !

Lisa Ray
2019-08-31 11:37:47

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమా సాహో. ఈ సినిమా మీద ఉన్న భారీ అంచనాల మధ్య నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయ్యింది. దాదాపు 10 వేల స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు మేకర్స్. 300 కోట్ల బడ్జెట్ తో, బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కానీ సాహో చిత్రం పూర్తిస్థాయిలో ప్రేక్షకులని అలరించేలా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. విపరీతమైన నెగటివ్ టాక్ తో ఇప్పటికే ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు సాహో మేకర్స్ కి మరో తలనొప్పి వచ్చింది. సాహో చిత్రం మీద కాపీ ఆరోపణలు చేస్తున్నారు బాలీవుడ్‌ నటి లిసా రే. సాహో యూనిట్‌, షిలో శివ్‌ సులేమాన్‌ ఆర్ట్‌ వర్క్‌ను కాపీ కొట్టారని లిసా ఆరోపిస్తున్నారు. అంతేకాక ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసింది. 

ప్రభాస్‌, శ్రద్ధా కలిసి ఉన్న 'బేబీ వోన్ట్‌ యూ టెల్‌ మీ' అనే పోస్టర్‌ను, దాంతో పాటు ఒరిజినల్‌ పోస్టర్‌కు సంబంధించిన చిత్రాలను లిసా రే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ రెండు ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్ట్‌ వర్క్‌ ఒకేలా ఉండడం ఆమె ఆరోపణలకి బలం చేకూరుస్తోంది. ఆ డిజైన్‌ను 2014లో రూపొందించారట. తన క్రియేటివిటీని దొంగిలించి కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని ఆమె పేర్కొనగా ‘ఇలా ఒకరి పనితనాన్ని దొంగిలించేవారికి వ్యతిరేకంగా నిలబడి ఖండించాల్సిన సమయం వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. భారీ సినిమాను తెరకెక్కించిన ఓ నిర్మాణ సంస్థ ఒకరి ఆర్ట్ వర్క్‌ను దొంగిలించడం మంచిది కాదు. దీనిని దొంగతనం అంటారు. ప్రపంచంలో ఎక్కడా వీటిని సహించరని పేర్కొన్నారు. అయితే ఆమె అన్నట్టు అది ఆ ఆర్ట్ వర్క్ కి ప్రేరణగా తీసుకున్నదే అనిపిస్తోంది. మరి ఆ నటి ఎందుకు అలా ఆరోపణలు చేసిందో మరి. 

More Related Stories