English   

సాహో ఎఫెక్ట్ లార్గోవించ్ డైరక్టర్ పై కేసు వెయ్యాలట

Saaho
2019-08-31 12:55:20

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా నిన్న పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యింది. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన సాహో భారీ అంచనాల నడుమ బాక్స్ ఆఫీస్ బరిలో దిగి మొదటి ఆట నుండే విపరీతమైన డివైడ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సినిమా మీద బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటో మీకే అర్ధమవుతోంది. ఈ సినిమాలో స్టంట్స్ , ప్రభాస్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ డైరెక్టర్ సుజీత్, కధా కధనాల విషయంలోనే భారీ విమర్శలు వస్తున్నాయి. అయితే అదొక్కటే కాకా సాహో చిత్రంపై కాపీ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఊహించని విధంగా అజ్ఞాతవాసి, లార్గో వించ్ సినిమాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ డిజాస్టర్ గా మారింది. అయితే తాజాగా విడుదలైన సాహో సినిమాకు పోలికలు బాగా ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది.

 అయితే ఈ రెండు సినిమాల కథకు మూలం ఒకటేనని, 2008లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా "లార్గో వించ్‌"కు ఫ్రీమేక్ గా అజ్ఞాతవాసి అపఖ్యాతి మూటగట్టుకోవడమే కాక ఆ సినిమా కాపీ రైట్స్ హక్కులకి భయపడి డబ్బు కూడా కట్టారు. అయితే ఇప్పుడు సాహో కథ మూలాలు కూడా ఫ్రెంచ్ చిత్రం "లార్గోవించ్‌"లో కనిపిస్తున్నాయని, అందుకే సాహో అజ్ఞాతవాసి 2.0 అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. సాహో సైతం ఈ రెండు సినిమాల లానే ఉందనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే లార్గోవించ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవగా ఆ సినిమాను గుడ్డిగా ఫాలో అయి తీసిన అజ్ఞాతవాసి, సాహోలకు మాత్రం పెద్ద దెబ్బే పడింది. గతంలో ‘అజ్ఞాతవాసి’ సినిమాను లార్గోవించ్ ఫ్రెంచ్ డైరక్టర్ జెరోమ్ సాలె థియేటర్‌లో చూసి మరీ తన సినిమాకు ఫ్రీమేక్ చేశారంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇప్పుడు 'లార్గోవించ్' సినిమా డైరక్టర్ పై కేసు వెయ్యాలి..రెండు పెద్ద డిజాస్టర్స్ కు కారణమయ్యాడని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు .

More Related Stories