English   

సాహో ఫస్ట్ డే కలెక్షన్స్.. అజ్ఞాతవాసి రికార్డులు ఫసక్..

 Saaho Collections
2019-08-31 13:36:06

అనుకున్నట్టుగానే సాహో సినిమా తొలి రోజు చాలా రికార్డులను బద్దలు కొట్టింది. కొన్ని ఏరియాల్లో ఏకంగా బాహుబలి 2 రికార్డులను కూడా తిరగరాయడం సంచలనంగా మారుతుంది. నైజాంతో పాటు నెల్లూరు ఏరియా లో బాహుబలి 2 రికార్డులు కూడా బద్దలు అయిపోయాయి. మరోసారి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేశాడు ప్రభాస్. సినిమాకు టాక్ తేడా వచ్చినా కూడా తొలిరోజు కలెక్షన్ల విషయంలో మాత్రం ప్రభాస్ దుమ్ము దులిపేసాడు. సాహో తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 36 కోట్ల 40 లక్షలు వసూలు చేసింది. ఇప్పటివరకు అజ్ఞాతవాసి పేరు మీద ఈ రికార్డు ఉండేది. ఆ సినిమా తొలి రోజు 27 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఖైదీ నెంబర్150 25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక బాహుబలి తొలిభాగం 23 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. బాహుబలి 2 ఈ విషయంలో అందరికంటే అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా 68 కోట్లకి పైగా షేర్ తీసుకువచ్చి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. అయితే నాన్ బాహుబలి రికార్డుల్లో మాత్రం ఇప్పుడు సాహో సరికొత్త చరిత్ర కు తెర తీసింది. ఓవర్సీస్ లో కూడా తొలిరోజు మిలియన్ మార్క్ అందుకుంది సాహో. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే అక్కడ కేవలం ఒక మిలియన్ రావడం మాత్రం తక్కువే. బాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లు సాధించింది సాహో. తొలిరోజు అన్ని భాషల్లో కలిపి కేవలం ఇండియాలోనే 100 కోట్లు వసూలు చేసిన రెండో సినిమాగా చరిత్ర సృష్టించింది సాహో. దీనికి ముందు బాహుబలి 2 ఈ రికార్డుని అందుకుంది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమానే రికార్డులు తిరగరాసింది. తొలి రోజు వరకు అన్ని చోట్ల బాగానే ఉంది కానీ రెండో రోజు నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాక్ బయట దారుణంగా ఉండటంతో అది కలెక్షన్లపై ఎక్కడా ప్రభావం చూపిస్తుందో అని భయపడుతున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories