English   

ఆయన సినిమాలో ఉంటే అంతే సంగతులు.. 

 Jackie Shroff
2019-08-31 17:58:09

కొందరికి తెలియకుండానే ఇలాంటి ఐరన్ లెగ్ ముద్ర వచ్చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక నటుడిపై ఇలాంటి ముద్ర చాలా ఏళ్లుగా కంటిన్యూ అవుతుంది. అయితే దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సాహో సినిమా ఇది మరోసారి నిరూపించే సరికి నిజంగా ఇప్పుడు ఆ నటుడు అంటే అంతా భయపడుతున్నారు. అంతగా తెలుగు ఇండస్ట్రీని భయపెడుతున్న యాక్టర్ జాకీ ష్రాఫ్. హిందీలో ఎన్నో సంచలన సినిమాలు చేసిన ఈయన హీరోగా రికార్డులు తిరగరాశాడు. కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఆయన నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరుస్తూనే వచ్చింది. మంచు విష్ణు హీరోగా నటించిన అస్త్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు జాకీ ష్రాఫ్. ఆ తర్వాత బ్యాంక్, బ్లాక్ అండ్ వైట్, శక్తి, పంజా సినిమాలు చేశాడు. ఇందులో ఏ ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రిజల్ట్ తీసుకురాలేదు. అన్ని సినిమాల్లోనూ మంచి పాత్రలే చేసాడు కానీ ఏ ఒక్కటి తెలుగులో కోరుకున్న విజయం అయితే తీసుకురాలేకపోయింది. అందుకే జాకీ ష్రాఫ్ సినిమాలో ఉంటే సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఒకటి వచ్చేసింది. తాజాగా విడుదలైన సాహో సినిమాకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో రాయ్ పాత్రలో నటించాడు జాకీ ష్రాఫ్. ఇప్పుడు ఈ సినిమాకు కూడా నెగటివ్ టాక్ రావడంతో అభిమానులు భయపడుతున్నారు. దర్శక నిర్మాతలు కూడా ఇకపై జాకీష్రాఫ్ ను తీసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. నిజంగానే ఆయన ఆ పాత్రకు సూట్ అయినా కూడా ఆయనపై ఉన్న బ్యాడ్ సెంటిమెంటుతో అవకాశాలు రావడం కష్టమే అనిపిస్తుంది. ఏదేమైనా తెలుగులో తొలి విజయం అందుకోవాలనుకున్న జాకీ ష్రాఫ్ కలలను సాహో సినిమా కూడా నిలబెట్టలేకపోతుంది.

More Related Stories