English   

మరో పవన్ కళ్యాణ్ గా మారిపోతున్న ప్రభాస్.. టెన్షన్ లో ఫ్యాన్స్..

Prabhas Pawan kalyan
2019-08-31 19:01:44

ప్రభాస్ కు నిజంగా పవన్ కళ్యాణ్ అంత ఫాలోయింగ్ ఉందా.. ఈ ప్రశ్నకు సమాధానం కచ్చితంగా లేదని వస్తుంది. ఎందుకంటే ప్రభాస్ ఇమేజ్ వేరు.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ వేరు. ఇద్దరికీ ఎక్కడా పోలిక కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఒక విషయంలో మాత్రం ఇద్దరు కలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని చూస్తున్నట్లు ఉంది ఇప్పుడు ప్రభాస్ ను చూస్తుంటే. ఆయన రాజకీయాల్లో బిజీ కావడంతో పవన్ వారసత్వాన్ని ప్రభాస్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇంతకీ ఏ విషయంలో పవన్ కళ్యాణ్ ను ప్రభాస్ అనుసరిస్తున్నాడో తెలుసా. బద్ధకం విషయంలో.. అవును అవును నమ్మడం కాస్త కష్టమే కానీ ఇదే నిజం. సాహో సినిమా చూసిన తర్వాత అభిమానులకు కూడా ఇదే అనిపిస్తుంది. స్క్రీన్ పై చాలా బద్దకంగా కనిపించాడు ప్రభాస్. కనీసం కదలడానికి కూడా ఇష్టం లేనట్లుగా అక్కడే ఉండి లేజీగా కనిపించాడు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఇలా చేస్తూ ఉంటాడు. ఆయన గత సినిమా అజ్ఞాతవాసిలో స్క్రీన్ పై కదలడమే కష్టం అన్నట్లుగా కనిపించాడు. తాను చేసిందే ఫైట్స్ అన్నట్లు.. చెమట చుక్క పట్టకుండా ఇస్త్రీ చొక్కా నలగకుండా ఫైట్లు చేశాడు. రిస్క్ తీసుకోవడం కూడా ఎప్పుడో మానేసాడు పవన్ కళ్యాణ్. డాన్సులు అసలే చేయడు. ఇమేజ్ వుంది కాబట్టి ఏం చేసినా సరిపోతుందని పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై బద్దకంగా కనిపిస్తాడని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు సాహో చూసిన తర్వాత ప్రభాస్ కూడా ఇలాగే మారిపోయాడేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసినా కూడా చాలా లేజీగా కదిలాడు ప్రభాస్. ఇక యాక్షన్ సన్నివేశాల్లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. అదే బాహుబలి సినిమాలో నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడ్డాడు ప్రభాస్. ఈయన కష్టానికి ప్రతిఫలం కూడా దక్కింది. కానీ సాహోలో ఆ ఎనర్జీ అస్సలు కనిపించలేదు. మొత్తానికి ఆయన తీరు చూస్తుంటే మరో పవన్ కళ్యాణ్ అనిపిస్తున్నాడు.

More Related Stories