English   

మేనల్లుడి కోసం మహేష్ బాబు రంగంలోకి దిగుతాడా ?

mb
2019-08-31 19:18:24

టీడీపీ ఎంపీ, సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. గతేడాది దిల్ రాజు ప్రొడక్షన్ లో 'అదే నువ్వు అదే నేను' అనే సినిమా దసరా రోజున ఓపెనింగ్ జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకి హాజరై క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు సినీ రాజకీయాల ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఆ సినిమా గురించి అప్పట్లో మహేష్ బాబు మాత్రం తన మేనల్లుడి కోసం ఒక్క ట్వీట్ కానీ, పోస్ట్ కానీ పెట్టకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇతర హీరోల సినిమాల గురించి, ట్రైలర్ల గురించి ట్వీట్లు చేస్తూ తన సపోర్ట్ అందిస్తున్నారు. అయితే తన సొంత బావ కొడుకు సినిమా లాంచ్ అయిన సందర్భంగా ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే తర్వాత తెలిసిన సమాచారం ప్రకారం ఆ సినిమా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఆగిపోయింది. ఆ సినిమానే దిల్ రాజు ఇప్పుడు రాజ్ తరుణ్ తో తీస్తున్నాడు.

అయితే ఆ కధ మహేష్ కి నచ్చలేదని అందుకే ఆ సినిమా చేయద్దని అల్లుడికి చెప్పాడని అంటున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం. అయితే ఈ సారి కధ మహేష్ కూడా విని ఓకే చేశాడని అంటున్నారు. ఈసారి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నార‌ని అంటున్నారు. `భ‌లే మంచి రోజు`, `శ‌మంత‌క మ‌ణి`, `దేవ‌దాస్‌` చిత్రాలను తెరకెక్కించిన శ్రీ రామ్ ఆదిత్య ఇప్పుడు గ‌ల్లా అశోక్‌ను త‌న సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేయ‌నున్నారని అంటున్నారు. జూలైలోనే ఈ సినిమా ప్రారంభం అవుతుంద‌ని ప్రచారం జరిగినా అది కుదరలేదు. ఈ సినిమాను అతి త్వరలో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని, క్రేజ్ పెంచే దృష్ట్యా ఈ సినిమా ప్రారంభోత్సవానికి, ఈ సారి మేనల్లుడి కోసం స్వయంగా సూపర్ స్టార్ మహేష్ ఆ వేడుకకు హాజరు కానున్నారని అంటున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని అంటున్నారు. 

More Related Stories