English   

ఇటలీలో డ్యూయెట్ లు ప్లాన్ చేసిన గోపీచంద్

gopi
2019-08-31 19:43:30

గోపీచంద్‌ హీరోగా తమిళ్ దర్శకుడు తిరు దర్శకత్వంలో చాణక్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెహరీన్, కత్రినాకి జిరాక్స్ లా ఉండే జరీన్‌ఖాన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ఆ మధ్య వాఘా బోర్డర్ లో జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ యాక్షన్‌ సీన్‌లో భాగంగా గోపీచంద్‌ గాయపడటంతో ఈ సినిమాకు బ్రేక్‌ పడిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారు. దాంతో సినిమా షూట్ కూడా మంచి జోరుగా సాగుతోంది. 'రా' (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌గా తన తెలివితేటలతో ప్రత్యర్థుల ఎత్తులను ఎలా చిత్తు చేసి దేశాన్ని కాపాడాడు అనే లైన్ తో ఈ సినిమాని తెరకేక్కిస్తున్నా రు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాకీ పార్ట్‌ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటోంది. స్టార్ కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం ఇటలీ, మిలాన్‌లో గోపీచంద్ చేత డాన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్స్ షూటింగ్‌ విశేషాలను అక్కడి లోకల్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా స్పెషల్‌ గా టెలికాస్ట్‌ కూడా చేసింది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు గోపీ అండ్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమా అయ్యాక బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు.

 

More Related Stories