English   

యూత్ సినిమాల డైరెక్టర్ తో బెల్లం బాబు

sai
2019-08-31 20:11:55

బెల్లంకొండ శ్రీనివాస్‌ని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని బెల్లంకొండ సురేష్‌ ఇప్పటికే ఎన్నో కోట్లు ఇన్వెస్ట్‌ చేసాడు. వినాయక్‌, బోయపాటి లాంటి దర్శకుల చేత స్టార్ హీరోయిన్లని పెట్టి సినిమా చేసినా అది కలసి రాలేదు. మొన్న అనుకోకుండా తీసిన రాక్షసుడు పెద్ద హిట్ అయింది. కమర్షియల్ హిట్ కూడా కావడంతో అదే ఆయన కెరీర్లో మొదటి హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తాడా అనే అనుమానాలు ఉండగా ఇప్పుడు ఆ విషయం మీద క్లారిటీ వచ్చింది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ వంటి సినిమాలతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న త్రినాధరావు నక్కిన గతేడాది రామ్ తో హలో గురు ప్రేమ కోసమే సినిమా తీసి డల్ అయ్యాడు.

అయితే నిజానికి శ్రీనివాస్ జయజానకినాయక సినిమాకి ముందే ఈ కధ ఒప్పుకున్నాడు. అయితే మరెందుకో ఏమో కానీ ఈ సినిమా రెండేళ్ళు డిలే అయింది. ప్రస్తుతం ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.  యువతను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేస్తోన్న త్రినాధరావుతో కలిసి వర్క్ చేస్తే తన కెరీర్ కు ప్లస్ అవుతుందని ఈ యంగ్ హీరో ఆలోచిస్తున్నాడని అంటున్నారు. గతంలో ఈ లైన్ ఇద్దరూ అనుకున్నప్పుడు బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా సినిమా చేయనున్నారు అనుకున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమాని ఆయనే నిర్మిస్తారో లేక మరెవరయినా నిర్మిస్తారో చూడాలి.

More Related Stories