English   

ఆ రానా సినిమా వాయిదా పడిందా

rana
2019-08-31 20:26:51

యంగ్ హీరో రానా, మళయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా విరాటపర్వం. నీది నాది ఒకే కథ సినిమా ఫేం దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నక్సలైట్ ఉద్యమం నేపథ్యంతో 1990ల నాటి కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కుతోందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సీనియర్ నటీమణి టబును తీసుకున్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సినిమా షూటింగ్ ప్రారంభమై ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా నుంచి టబు తప్పుకుంది. టబు తప్పుకోవడంతో ఆమె పాత్రలో నందితా దాస్ ను తీసుకున్నారట. ఆమె తాజాగా షూటింగ్ స్పాట్ లోకి అడుగుపెట్టారని అంటున్నారు.

ప్రస్తుతం అమెరికాలో వున్న నటుడు రానా త్వరలోనే ఈ షూట్ లో జాయిన్ అవుతారట. సెప్టెంబర్‌ మొదటి వారంలో హైదరాబాద్‌ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకూ సాయి పల్లవి, మిగిలిన నటీనటులు పాల్గొనే కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఇప్పుడు రానా పాల్గొనే సీన్లను రూపొందించనున్నారని అంటున్నారు. అయితే మరో ప్రచారం కూడా జరుగుతోంది అదేంటంటే రానాతో సెప్టెంబర్‌ షెడ్యూల్‌ ప్లాన్ చేయగా ఇప్పుడు ఆ షెడ్యూల్ రద్దు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే అమెరికా నుండి రాగానే రానా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'హిరణ్య కశ్యప' చిత్రీకరణలో పాల్గొనున్నాడని అంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థనే నిర్మిస్తుండడంతో పెద్దగా సమస్యలు ఏవీ తలెత్తవని కాకపోతే సినిమా డిలే అవుతుందని అంటున్నారు.

More Related Stories