టాలీవుడ్ క్వీన్ కి కోచ్ గా బాలీవుడ్ స్టార్ హీరో

ప్రస్తుతం బయోపిక్స్ సీజన్ నడుస్తోంది. నేం, ఫేం ఉన్న రాజకీయ, సినీ, కేరీడా రంగాల వారి జీవితాలను సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. 2016లో ఒలిపింక్ గోల్డ్ మెడల్ సాధించి, ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె బయోపిక్ తెరకెక్కించాలని ముందు నుండే అనుకుంటున్నారు. నటుడు సోనూ సూద్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కానీ సింధు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ మధ్య పరిణీతి చోప్రా ఈ సినిమాలో నటిస్తుందని ప్రచారం జరిగినా అది జరిగేట్టు కనిపించడం లేదు.
ఆయన మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సంప్రదింపులు జరిపినా ఎవరూ ఒప్పుకోలేదట. దీంతో సౌత్‌లో వరుస సక్సెస్ లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న సమంతతో ఈ పాత్ర నటింప చేసే ఆలోచనలో సోనూ ఉన్నారని అంటున్నారు. ఇక కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్నారని అంటున్నారు. తాజాగా ఈ విషయం మీద జీటీవీ ట్విట్టర్ నుంచి వచ్చిన ఓ ట్వీట్ ఈ ప్రచారానికి కారణమైంది. అదే ' పీవీ సింధు బయోపిక్ రూపొందనుందన్న ప్రచారం జరుగుతుంది. అందులో పీవీ కోచ్ పుల్లెల గోపీచంద్‌గా అక్షయ్ కుమార్ నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు రిపోర్ట్ అందిందని పేర్కొంది.