English   

ఆ ప్రచారం నిజమేనా... అల వైకుంఠపురంలో ఫస్ట్ లుక్

IMG-20190901-WA0042.jpg
2019-09-01 10:09:34

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మొన్నటి దాకా దాకా ఈ సినిమాకి రకరకాల పేర్లు ప్రచారం అయ్యాయి. తాజాగా దానికి అల వైకుంఠపురంలో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాకి సంబంధించి గ్లింప్జ్ అంటూ ఒక కూడా విడుద‌ల చేయ‌గా అందులో ముర‌ళీ శర్మ ఏంటిరా గ్యాప్ ఇచ్చావు అని బ‌న్నీని అడ‌గ‌గా ఇవ్వ‌లా వ‌చ్చింద‌ని అంటారు. బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ఈరోజు కొద్ది సేపటి క్రితం ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మొన్న విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలో బన్నీ, మెడలో కండువా, పెరిగిన జుట్టుతో మిడిల్ క్లాస్ పక్కింటి కుర్రాడి గెటప్ లో కనిపించాడు. 

మరోపక్క సెట్స్ నుండి లీకైన కొన్ని ఫోటోలలో బన్నీ సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ లుక్ లో కనిపించాడు. ఈరోజు విడుదలయిన లుక్ లో మిలియనీర్ లుక్ లో కనిపించాడు. జాగ్వార్ కార్ రోడ్ పక్కన ఆపి సెక్యూరిటీ చేత బీడీ వెలిగించుకుంటూ కమిపించాడు. ఇక ఈ సినిమాలో ఆయన రెండు మూడు షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి ఊతం ఇచ్చేలాగా ఉంది ఈ ఫస్ట్ లుక్. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఈ చిత్రం రూపొందుతుంద‌ని తెలుస్తుండ‌గా ఈ సినిమాలో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 

More Related Stories