English   

సాహో సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి..

saaho
2019-09-01 18:40:56

ఒక పెద్ద సినిమా విడుదల అయ్యింది అంటే కచ్చితంగా రాజమౌళి దానికి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటాడు. అందులోనూ స్నేహితుడు ప్రభాస్ సినిమా విడుదలైనప్పుడు మాత్రం ఎందుకు చూడకుండా ఉంటాడు.. ప్రస్తుతం బల్గేరియాలో RRR షూటింగ్ చేస్తున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి సాహో సినిమా చూసాడని తెలుస్తుంది. చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు రాజమౌళి. మరోసారి తన నటనతో నేషనల్ యాక్టర్ గా ప్రభాస్ ఎదిగాడని.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నాడు రాజమౌళి. ఇంత చిన్న వయసులో సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా నచ్చింది అంటున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి క్యారెక్టర్లో అయితే ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్ ను ఈ సినిమాలో ప్రభాస్ చేశాడని.. అందుకే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది అంటున్నాడు రాజమౌళి. ఇలాంటి సినిమాలు రావడం వల్ల తెలుగు సినిమా స్థాయిని ఇంకా పెరుగుతుంది అంటున్నాడు దర్శకధీరుడు. సినిమాలో అండర్ కవర్ ఆఫీసర్ గా ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. సినిమా మొత్తం ఎక్కడా ప్రభాస్ నటనలో తేడా రాకుండా చూసుకుంటాడని.. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయని చెబుతున్నాడు రాజమౌళి. కుర్ర దర్శకుడు సుజిత్ కి కూడా కంగ్రాట్స్ చెప్పాడు జక్కన్న. ఇండస్ట్రీ ఇలాంటి విజయాన్ని చూసి చాలా రోజులు అయిందని రాజమౌళి చెప్పడం గమనార్హం. సాహో బాహుబలిని మైమరపించే సినిమా అని రాజమౌళి చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవైపు సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత రాజమౌళి ఇలాంటి రివ్యూ ఇవ్వడం అభిమానులకు నచ్చడం లేదు.

More Related Stories