English   

వాల్మీకి ఓవర్సీస్ రైట్స్ అదుర్స్.. వరుణ్ తేజ్ కెరీర్లో రికార్డు..

varun
2019-09-01 20:05:55

వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వాల్మీకి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయాలనుకున్నా కూడా ఆరోజు నాని గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల కానుండటంతో వారం రోజులు ఆ సినిమా కోసం దీన్ని వాయిదావేశారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్ర బిజినెస్ పూర్తయిపోయింది. ఆంధ్రలో 10 కోట్ల వరకు ఈ సినిమాను అమ్మారు. ఇక ఇప్పుడు ఓవర్సీస్ హక్కుల విషయంలో కూడా వాల్మీకి సంచలనం సృష్టించాడు. ఈ చిత్రాన్ని అక్కడ రెండున్నర కోట్లకు యూఎస్ తెలుగు సంస్థ తీసుకుంది. వరుణ్ తేజ్ మార్కెట్ తో పోలిస్తే రెండున్నర కోట్లు కాస్త ఎక్కువే. అయితే రిఫండబుల్ పద్ధతిలో ఈ చిత్రం హక్కులను అక్కడి బయ్యర్స్ కొన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నష్టం వస్తే మళ్లీ దర్శక నిర్మాతలు డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేయాలి.. లాభాలు వస్తే ఇద్దరూ కలిసి పంచుకోవాలి. వాల్మీకి హక్కులను అలా అక్కడ అమ్మేశారు. నైజాంలో కూడా భారీగానే ఈ చిత్రం రేట్ ఉంటుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ వరుస విజయాలు వాల్మీకి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను దాదాపు 22 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో హరీష్ శంకర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచిన జిగర్తాండ సినిమాకు ఇది తెలుగు రీమేక్. తమిళ హీరో అథర్వా మురళి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

More Related Stories