English   

అఖిల్ కి సాయం చేయనున్న నివేదా థామస్

akhil
2019-09-01 21:32:39

చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ చ‌విచూసిన అఖిల్ త‌న కెరీర్‌లో ఎలా అయినా విజ‌యం సాధించాల‌నే క‌సితో ఉన్నాడు. మొదటి సినిమాగా అఖిల్ సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తొలి సినిమానే ఫ్లాప్ కావ‌డంతో ఆ త‌ర్వాత విభిన్న క‌థాంశాలతో హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు చేశాడు. ఇవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ఆయ‌న నాలుగో సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నాడు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న నాలుగో చిత్రాన్ని అఖిల్ చేయ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌ మీద బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం మొద‌లైంది.

అయితే అది లైన్ లో ఉండగానే అఖిల్ త‌న‌ 5వ సినిమాకి కూడా రంగం సిద్ధం చేసుకున్నాడ‌ని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన కధ నచ్చడంతో అఖిల్ ఒప్పుకున్నాడని ఆ ప్రచారం సారాంశం. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో అఖిల్ కి జంటగా నివేదా థామస్ నటించనున్నారని అంటున్నారు. ఇందులో అఖిల్‌ లుక్‌ సరికొత్తగా, ఇప్పటివరకూ చూడని విధంగా ఉంటుందట. అందుకే ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నారని అంటున్నారు. అందుకే భాస్కర్ సినిమా పూర్తయిన తర్వాతే ప్రశాంత్‌ వర్మతో చేయనున్న సినిమా మొదలవుతుందని అంటున్నారు.

 

More Related Stories