English   

పాపం రాజ్ తరుణ్...ఆ సినిమా ఆగింది

tarun
2019-09-02 05:49:52

ఈమధ్య కాలంలో సరయిన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కుర్ర హీరో రాజ్ తరుణ్. ఈ మధ్య యాక్సిడెంట్ చేసి ఆయన వార్తల్లో నిలిచాడు. ఎవరికీ ఏమీ ప్రాణ నష్టం జరగకున్నా కెరీర్ కి మాత్రం పెద్ద నష్టమే జరిగిందని చెబుతున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ కి సిద్దమయిన సమయంలో ఆ యాక్సిడెంట్ పుణ్యమా ఆ సినిమా వాయిదా పడిందని అంటున్నారు. రాజ్ తరుణ్ హీరోగా 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమా తెరకెక్కించాడు దిల్ రాజు. మహేష్ మేనల్లుడితో తీయాలనుకున్న ఆ సినిమాని మధ్యలో ఆపేయడంతో చివరికి రాజ్ తరుణ్ ని పెట్టి సినిమా పూర్తి చేశాడు. సాహో మేనియా సైలెంట్ అయ్యాక ఇక రేపోమాపో ప్రచారం స్టార్ట్ చేసి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. ఈలోపు రాజ్ తరుణ్ యాక్సిడెంట్ చేశాడు. ఒక టౌన్ షిప్ లో ఓ గోడకు ఢీకొట్టాడు.

ఆ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ ఆరోపణలు రావడం ఇదంతా పెద్ద ఇబ్బందిగా మారి అతడి ఇమేజ్ కి మరకలు పడేలా చేసింది. ఇక జనాలు ఈ ఘటన మరువక ముందు సినిమా రిలీజ్ కోసం రాజ్ తరుణ్ మీడియా ముందుకొస్తే ఎవరో ఒక మీడియా వారు యాక్సిడెంట్ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. యాక్సిడెంట్ స్పాట్ నుంచి రాజ్ తరుణ్ పారిపోయిన విషయాన్ని మీడియా తెరమీదకి తెచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే సినిమాకి నెగటివ్ ప్రచారం జరిగి ఇబ్బంది పడతామని భావించిన దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేశాడని అంటున్నారు. యాక్సిడెంట్ విషయాన్ని  మరిచిపోయారని అనుకున్నాకే ఈ మూవీని రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడని అంటున్నారు. మరోపక్క రాజ్ తరుణ్ మరో రెండు సినిమాలు ఒప్పుకున్నట్టు చెబుతున్నారు.

More Related Stories