English   

ఆ బాలీవుడ్ సినిమా రీమేక్ చేయనున్న నితిన్

nithin
2019-09-02 06:09:32

ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీలో రీమేక్స్ రాజ్యం ఏలుతున్నాయి. ఇతర భాషలలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి దాదాపుగా అన్నీ హిట్స్ కొడుతున్నారు నిర్మాతలు. ఇక ఈ ఏడాది ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో ఎక్కువ శాతం అవార్డులు గెలుచుకున్న బాలీవుడ్ సినిమా అంధాదున్. శ్రీరామ్ రాఘవ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా అద్భుతమైన నటనతో మెప్పించడమే కాక నేషనల్ అవార్డ్స్ కూడా సాధించారు. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం అంధాదున్ నిర్మాణ సంస్థ అయిన వయాకామ్ 18 నుండి నితిన్ తండ్రి నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగు రైట్స్ కొనేశారట.

ఈ సినిమాను తెలుగులో నితిన్ హీరోగా చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ, వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత నితిన్ అంధాదున్ రీమేక్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారన్న విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మరో ప్రచారం ప్రకారం భీష్మ సినిమా పూర్తయిన తరువాత మిగిలిన రెండు సినిమాల గ్యాప్ లో అంథదూన్ రీమేక్ చేస్తాడని కూడా అంటున్నారు. ఇక డైరెక్టర్ గా ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమా డైరక్టర్ స్వరూప్ పేరు  వినిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories