English   

హైదరాబాద్ లో షూట్ మొదలుపెట్టనున్న బాలయ్య

 Balakrishna
2019-09-02 09:49:26

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. కధానాయకుడు-మహానాయకుడు సినిమాల తర్వాత ఎన్నికలు రావడంతో గ్యాప్ ఇచ్చిన బాలయ్య ఈ సినిమా త్వరగా పూర్తి చేసేసి రిలీజ్ చేసేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాని బాలయ్యతో జై సింహా తెరకెక్కించిన తమిళ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తెరకెక్కిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మాత సి.కల్యాణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల థాయ్ లాండ్‌లో మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ భారత్ తిరిగి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెండవ షెడ్యూల్ ఈ నెల 5 నుండి హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమవుతుందట. ఇది లాంగ్ షెడ్యూల్ అని చాలా వరకూ షూట్ ఈ షెడ్యూల్ లోనే పూర్తి చేస్తారని అంటున్నారు. 

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో కనపడతారట. నిన్న విడుదలైన ఓ అల్ట్రా మోడరన్ లుక్‌కి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ఇక రెండవ లుక్ ని సినిమా రిలీజ్ దాకా సస్పెన్స్ మైంటైన్ చేయాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌ పాటు వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శాతకర్ణి సినిమా నుండి బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిన చిరంతన్‌ భట్‌ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. పోలీస్ నుండి గ్యాంగ్ స్టర్ గా మారిన కధతో ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. చూడాలి మరి రెండో లుక్ ఎలా ఉంటుందో ?

More Related Stories