English   

పుట్టినరోజు జరుపుకోనన్న పవర్ స్టార్...అందుకేనట

Pawan Kalyan
2019-09-02 11:44:53

జనానికి ఆయన జనసేనాధిపతి, అభిమానులకి అన్నయ్య, అభిమానం ముదిరిన వారికి ఆయనో దేవుడు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈరోజు ఆయన తన 48 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు పుట్టినరోజు జరుపుకుంటారు కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం పుట్టిన రోజు జరుపురు. పుట్టిన రోజు జరుపుకోవడం తనకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ గతంలో స్పష్టం చేశారు. గత ఏడాది పుట్టినరోజునాడు ఆయనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు. తాము 8మంది సంతానం కాగా అందులో ముగ్గురు చనిపోయారని, తమది తక్కువ ఆదాయం ఉన్న కుటుంబం కాబట్టి చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా పుట్టిన రోజు జరుపుకోలేదని చెప్పారు. 

ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అయ్యిందని చెప్పుకొచ్చారు. అయితే పుట్టినరోజునాడు ఇంట్లో తమకు ఇష్టమైనదేదో చేసి పెడితే తినేవాడినని, పుట్టిన రోజు కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, భగవంతుడి ఆశీస్సులు కోరుకుంటానని చెప్పారు. అంతే గాక, తనకు పుట్టిన రోజులు జరుపు కోవడమంటే కొంచెం సిగ్గని, కొన్నేళ్ళ క్రితం దాకా తన పుట్టిన రోజు అని కూడా మర్చిపోయానని చెప్పారు. బతికి ఉన్నన్నీ రోజులు కూడా పుట్టిన రోజులేనని ఆయన చెప్పుకొచ్చారు. నాతో ఉంటే పబ్బులుండవు పార్టీలుండవు, విలాసాలు విహారాలకు నేను దూరం, ఉంటే ఏ మూలో పుస్తకం చదువుతూ ఉంటాను. లేకపోతే చెట్లమధ్యనో ఆవులతోనో ఉంటాను, నాతో ఉన్నవారికి సుఖం ఉండదు…ఏం చేయను… నా జీవితం ఇలాగే ఉంటుంది’ అంటూ పవన్‌ కల్యాణ్‌ తానేంటో వివరంగా చెప్పేస్తారు. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యాడు, వేలాది మంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

More Related Stories