English   

వాల్మీకి నుండి స్పెషల్ లుక్స్...

valmiki
2019-09-02 19:03:25

మెగా హీరో వ‌రుణ్ తేజ్ హీరోగా రీమేక్ ల వీరుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘వాల్మీకి’. తమిళ హిట్ సినిమా జిగార్తాండాకి తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావొస్తున్న ఈ సినిమా మరో పడి రోజుల్లో రిలీజ్ కూడా కానుంది. వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా, తమిళ నటుడు అధర్వ మురళి రచయితగా నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 13న రిలీజ్‌ అవుతుందని భావించినా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సూచనతో 20న విడుద‌ల చేయాల‌ని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు వినాయకచవితి సహా పవన్ పుట్టిన రోజు కావడంతో రెండు పోస్టర్స్ రిలీజ్ చేసింది ఈ సినిమా యూనిట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా వాల్మీకి చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసి ఆకట్టుకుంది.

వాల్మీకి సినిమాలో ఇప్పటిదాకా వరుణ్ తేజ్ గుబురు గడ్డంతో ఉన్న పిక్స్ మాత్రమే ఉండగా ఈరోజు స్పెషల్ గా కుర్ర లుక్ లో డిఫరెంట్ లుక్‌ను పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసి అభిమానులలో ఉత్సహం నింపారు. అలాగే వినాయక చవితి కానుకగా మరో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ లుక్స్ లో వరుణ్ జుట్టు, మీసాలతో 'పున్నమినాగు'లో చిరంజీవి ని జ్ఞప్తికి తెస్తున్నాడు. సినిమాలో సింహ భాగం రఫ్‌లుక్‌తో కనిపించే వరుణ్ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సీన్స్‌లో ఈ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామీణ నేపథ్యమున్న శ్రీదేవి పాత్రలో పూజాహెగ్డే అందంగా కనిపిస్తోంది. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదలైన పోస్టర్‌లో వరుణ్ తేజ్ గోడపై పడుకుని ఉండగా పూజాహెగ్డే పాతకాలం యాంటెన్నాని పట్టుకుని నిలబడి ఉంది. ఈ రెండు లుక్‌లూ మెగాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

More Related Stories