English   

సాహో ప్రభాస్ అంటున్న కలెక్షన్స్

saaho
2019-09-02 20:17:44

సాహో ప్రభాస్ అవును ఇప్పుడిదే మాట వినిపిస్తోంది. తెలుగులోనే కాక రిలీజ్ అయిన అన్ని బాషలలో సాహో చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా సాహో దుమ్ములేపే కలెక్షన్స్ సాధిస్తోంది. రెండురోజుల్లో 205 కోట్లు సాధించిన ఈ చిత్రం మూడు రోజుల్లో 294 కోట్లు కలెక్ట్ చేసినట్టు యూనిట్ ప్రకటించింది. ఇంత డివైడ్ టాక్ వచ్చినా ఈ సినిమా సృష్టిస్తున్న ఈ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సాహో చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇకపోతే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మూడురోజులకు 294 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడంతో సినిమా మీదున్న నెగటివ్ టాక్ కూడా మరుగున పడుతోంది. హిందీలో రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతుండటంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ లు మంచి ఊపు మీదున్నాడు.

More Related Stories