English   

సూర్యకి బందోబస్త్ గా అర్జున్ రెడ్డి

suriya
2019-09-02 20:52:38

 విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సూర్య హీరోగా రూపొందిన తాజా చిత్రం కాప్పాన్. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా తమిళంలో కాప్పన్ పేరుతో వస్తున్న ఈ సినిమాని తెలుగులో బందోబస్త్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సూర్యతో 'వీడొక్కడే', 'బ్రదర్స్' వంటి చిత్రాలను తెరకెక్కించిన కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్యతో పాటు మోహన్ లాల్, ఆర్యలు ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాప్పాన్ అంటే తమిళంలో కాపలాదారుడు, అందుకే తెలుగులో కూడా బందోబస్త్ అని పేరు పెట్టారు. ఇక ఈ సినిమాలో ప్రధానమంత్రిగా కనిపించే మోహన్‌ లాల్‌ కి సూర్య సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ముందు ఆగస్టు 30న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు.

అయితే ఆరోజున ప్రభాస్ సాహో సినిమా నాలుగు బాషలలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ వాయిదా పడి సెప్టెంబర్ ఇరవయ్యో తారీఖున రిలీజ్ చేయనున్నట్టు  ప్రకటించింది సినిమా యూనిట్. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను సెప్టెంబర్ రెండో వారంలో గ్రాండ్‌గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ బందోబస్త్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిదిగా వెళుతున్నాడని అంటున్నారు. విజయ్ దేవరకొండ తాను నోటా సినిమా నటించినప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య తమిళ నోటా సినిమా ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చి తన మద్దతు తెలిపాడు. దీంతో తన వంతుగా ఇప్పుడు విజయ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతున్నట్టు చెబుతున్నారు.

 

More Related Stories