English   

పవన్ కల్యాణ్‌ను అవమానించిన నికీషా పటేల్.. ఆగ్రహంలో ఫ్యాన్స్..

nik
2019-09-02 21:26:52

నికీషా పటేల్.. ఈ పేరుకు తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక్కసారి పులి హీరోయిన్ అంటే అర్థం అయిపోతుంది. పవన్ తో ఒకే సినిమా చేసినా కూడా అదే ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా పులి హీరోయిన్ లా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది నికీషా. అయితే ఇప్పుడు ఈమె చేసిన ఒక్క ట్వీట్ సంచలనంగా మారింది. ఈమె తెలిసి చేసిందో.. లేదంటే తెలియకుండా చేసింది తెలియదు కానీ నికీషా పటేల్ ట్వీట్ మాత్రం సెన్సేషనల్ అయిపోయింది. పవన్‌కు బర్త్ డే విషెస్ చెబుతూనే ఇరుక్కుపోయింది. యాంటీ ఫ్యాన్స్ చేసిన పబ్లిసిటీలో అడ్డంగా బుక్ అయిపోయింది నికీషా. పవన్ కల్యాణ్ పేరుతో చేసిన ట్యాగ్స్‌లో ఒకటి పావలా కల్యాణ్ అని ఉంది. అది చూసుకోకుండా ఈమె తన ట్వీట్ ను ట్యాగ్ చేసింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేసి కూడా చాలా సేపు అవుతున్నా కనీసం చూసుకోకుండా అలాగే ఉండిపోయింది ఈ హీరోయిన్. దాంతో సోషల్ మీడియాలో నానా రచ్చ జరుగుతుంది. పులి తర్వాత తెలుగులో పెద్దగా కనిపించింది లేదు ఈ బ్యూటీ. మళ్లీ ఇప్పుడు పవన్ బర్త్ డే విషెస్ చెబుతూ ఇలా కాంట్రవర్సియల్ ట్వీట్ చేయడం మాత్రం సంచలనంగా మారింది. హ్యాపీ బర్త్ డే పావలా కల్యాణ్ అనేది ఉన్నా కూడా చూసుకోకుండా పోస్ట్ పెట్టడం ఏంటని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ సెగలు ఆమె వరకు వెళ్తాయో లేదో చూడాలి.

More Related Stories