ఇంతకీ పవన్ అసలు ఏజ్ ఎంత.. హాఫ్ సెంచరీ దాటేసాడా..

పవన్ కల్యాణ్ వయసు ఎంత..? ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్న ప్రశ్న ఇది. వికిపిడియాను అడిగితే అది కూడా తప్పు చెబుతుంది. అన్నీ చెప్పే గూగుల్ తల్లి కూడా పవన్ వయసు విషయంలో మాత్రం తడబడుతుంది. ఓ సారి 47 అంటుంది.. మరోసారి 48 అంటుంది.. కాస్త గట్టిగా అడిగితే 49 అంటుంది.. కానీ ఏదీ పర్ఫెక్ట్ గా చెప్పడం లేదు. దాంతో ఇప్పుడు పవన్ వయసు ఏంటి అనేది గండికోట రహస్యంలా మారిపోయింది. అసలు తమ హీరో ఏజ్ ఎంతైనా పర్లేదు ఇప్పటికీ ఎప్పటికీ తమకు యంగ్ అంటున్నారు అభిమానులు. కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం పవన్ వయసు ఇంత అని ఓపెన్ గా చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే అసలు పవన్ రియల్ ఏజ్ ఎంత అని కనుక్కునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కొన్ని నిజాలు బయటికి వస్తున్నాయి. పవన్ ఇప్పుడు కాదు.. గతేడాదే 50 దాటేసాడు. అవును.. నమ్మడం కాస్త కష్టమే అయినా కూడా నిజంగానే పవన్ 2018లోనే 50 క్రాస్ చేసాడు. ఇప్పుడు ఆయన వయసు 51. అఫిడవిట్ లెక్కల ప్రకారం పవన్ కల్యాణ్ 02/09/1968లో జన్మించాడు. అంటే ఈ లెక్కన పవర్ స్టార్ ఏజ్ ఇప్పటికే హాఫ్ సెంచరీ దాటేసింది. కాకపోతే ఈయన లుక్స్ అలా ఉండవు కాబట్టి ఇంకా 50 ల్లోకి రాలేదంటున్నారు అభిమానులు. కానీ అసలు నిజం మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే.