English   

సాహో లేటెస్ట్ కలెక్షన్స్.. ఫైర్ ఫైర్స్ ది ఫైర్..

Saaho
2019-09-03 09:11:44

తొలిరోజు వచ్చిన టాక్.. ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్.. రెండూ రెండే. వేటికి సంబంధం లేదు.. పోలిక అసలే లేదు. అసలు ఎందుకు ప్రభాస్ సినిమాను ఇంతగా ఆడియన్స్ ఓన్ చేసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా క్రేజ్ ఉంటే ఓ సినిమాను ఈ రేంజ్ లో ఆదరిస్తారని ఇప్పుడు తెలుస్తుంది. సాహో మూడు రోజుల్లోనే 290 కోట్లు దాటేసి.. నాలుగో రోజుకు 300 కోట్ల క్లబ్బులో చేరిపోనుంది. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలు కూడా అనౌన్స్ చేసారు. తమ సినిమా మూడు రోజుల్లోనే 294 కోట్లకు పైగా వసూలు చేసిందని పోస్టర్లు విడుదల చేసారు మేకర్స్. ఇది చూసి నిజంగానే ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా పరేషాన్ అవుతున్నారు. హిందీలో సాహో నిజంగానే అద్భుతాలు చేస్తుంది. అక్కడ తొలిరోజు 24 కోట్లతో సరిపెట్టుకున్న సాహో.. తర్వాత రెండు రోజుల్లోనే దాదాపు 60 కోట్లు తీసుకొచ్చింది. నాలుగో రోజు కూడా వినాయక చవితి హాలీడే సందర్భంగా మరో 30 కోట్లకు పైగానే తీసుకొచ్చేలా కనిపిస్తుంది. ఇక తెలుగులోనూ ఈ చిత్రం దూకుడు మామూలుగా లేదు. నైజాంలో అయితే చరిత్ర తిరగరాస్తున్నాడు ప్రభాస్. ఇక్కడ మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. మరో 20 కోట్ల వరకు తీసుకురావాల్సి ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం బ్రహ్మాండంగా వస్తున్నాయి. తమిళం, మళయాలంలో కూడా సాహో ఓపెనింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి మూడు నాలుగు రోజుల వరకు ఎలాంటి సమస్యా రాలేదు. అసలు పరీక్ష ఇప్పట్నుంచి మొదలు కానుంది. వీక్ డేస్ లో వీక్ కాకుండా ఉంటే అప్పుడు సాహో నిజంగానే సాహోరే అనిపిస్తుంది. మరి చూడాలిక.. ఏం జరగనుందో..?

More Related Stories