English   

సాహో డిస్ట్రిబ్యూటర్లకు అభయం ఇస్తున్న ప్రభాస్..

  Prabhas
2019-09-03 12:07:57

సాహో సినిమా నాలుగు రోజులు దుమ్ము దులిపేసింది. బాక్స్ఆఫీస్ దగ్గర ఏకంగా సంచలన వసూళ్లు సాధించింది. కొన్ని చోట్ల బాహుబలి రికార్డులను సైతం తిరగరాసింది సాహో. హిందీలో 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తెలుగులో కూడా దాదాపు 70 కోట్ల వరకు షేర్ తీసుకువచ్చింది ఈ సినిమా. అయితే ఇప్పటివరకు ఎన్ని వసూళ్లు వచ్చాయి అనేది కాదు.. ఇప్పటి నుంచి ఎంత వస్తుంది అనేది సాహో భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఎందుకంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 290 కోట్ల షేర్ రావాలి. కానీ ప్రస్తుతం 170 కోట్లు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అంటే మరో 130 కోట్ల వరకు ఈ సినిమా తీసుకొస్తే కానీ సేఫ్ అనిపించుకోదు. ప్రస్తుతానికి తెలుగులో చాలా వరకు తగ్గిపోయింది సాహో జోరు. కేవలం నైజాంలో మాత్రమే మంచి వసూళ్లు వస్తున్నాయి. ఆంధ్రాలో ఇప్పటికే చాలా ఏరియాల్లో సాహో సినిమా కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. దాంతో బయ్యర్లు వణికిపోతున్నారు. ఇంత భారీ సినిమా ముంచేసింది అంటే తేరుకోవడానికి వాళ్లకు చాలా సమయం పడుతుంది. అయితే డిస్ట్రిబ్యూటర్ల బాధను అర్థం చేసుకున్న ప్రభాస్ వాళ్లకు అభయం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైపోయింది. వచ్చే ఏడాది సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది యూవీ క్రియేషన్స్ సంస్థ. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పుడు సాహో సినిమాని తీసుకొని నష్టపోయిన వాళ్లకు కాస్త అటు ఇటుగా రాధాకృష్ణ కుమార్ సినిమా అమ్మనున్నట్లు ప్రభాస్ అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో సాహో కాస్త నష్టపరిచినా కూడా తర్వాత సినిమా ఉందనే ధైర్యంతో కనిపిస్తున్నారు బయ్యర్లు

More Related Stories