English   

బాలీవుడ్ పై ప్రభాస్ ప్రభావం ఎంత.. అక్కడ సెటిల్ అయినట్లేనా..

Prabhas
2019-09-03 14:06:38

ప్రభాస్ అంటే ఇన్నాళ్లు తెలుగు హీరోగానే ప్రేక్షకులకు తెలుసు. కాని బాహుబలి తర్వాత ఆయన పాన్ ఇండియా పాపులారిటీ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజమౌళి ఎఫెక్ట్ తో బాహుబలి సినిమా భారీ కలెక్షన్లు సాధించింది అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు సాహో సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. అక్కడ నాలుగు రోజుల్లోనే 100 కోట్లు మార్క్ అందుకుంది ఈ చిత్రం. దీన్నిబట్టి ప్రభాస్ కు నేషనల్ వైడ్ గా పాపులారిటీ వచ్చింది అనే విషయం అర్థమైపోతుంది. వాళ్లు అతన్ని ఓన్ చేసుకున్నారు అని కూడా ఈజీగానే తెలిసిపోతుంది. కాస్త ప్లాన్ చేసుకుంటే ప్రభాస్ బాలీవుడ్లో జెండా పాతేయొచ్చు అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా సాహో సినిమాకు ఉత్తరాది రాష్ట్రాల్లో వస్తున్న వసూళ్లు చూసి అక్కడి ట్రేడ్ పండితులు కూడా షాక్ అవుతున్నారు. ఒక తెలుగు హీరోకు ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉండటాన్ని వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి సాహో సినిమాకు తొలి రోజు వచ్చిన టాక్ చూసి బాలీవుడ్ లో దారుణంగా డిజాస్టర్ అవుతుందని లెక్కలు వేసుకున్నారు అందరూ. బాహుబలి తో వచ్చిన ఇమేజ్ ను ప్రభాస్ అనవసరంగా పోగొట్టుకున్నాడు అంటూ విమర్శించారు. కానీ ఈ సినిమా తొలి రోజు 25 కోట్లు.. రెండు మూడు నాలుగు రోజుల్లో 30 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్లో సూపర్ స్టార్స్ కు తానేమీ తక్కువ కాదని నిరూపించాడు ప్రభాస్. దాంతో అసలు చిక్కులు మొదలయ్యాయి. బాలీవుడ్ లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమైపోయింది. సాహో సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాదేమో కానీ ఈ సినిమాతో మాత్రం కచ్చితంగా ప్రభాస్ ప్రభావం హిందీ ఇండస్ట్రీపై భారీగానే పడిందని తెలిసిపోతుంది. మరి దీన్ని యంగ్ రెబల్ స్టార్ ఎంత వరకు కంటిన్యూ చేస్తాడనేది చూడాలి.

More Related Stories