పెళ్లి తర్వాత కూడా తగ్గని ఆకాంక్ష సింగ్.. అదే హాట్ షో..

సాధారణంగా పెళ్లైతే ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు శుభం కార్డ్ పడ్డట్లే. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కెరీర్ ను అలాగే లీడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లలో సమంత.. రాధికా ఆప్టే లాంటి వాళ్లున్నారు. ఇక ఇదే లిస్ట్ లోకి వచ్చే మరో పేరు ఆకాంక్ష సింగ్. 2017లో మళ్లీరావా లాంటి ఫీల్ గుడ్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో కొన్ని సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది ఆకాంక్ష. ఇక గతేడాది దేవదాస్ లో నాగార్జునకు జోడీగా నటించింది ఈ బ్యూటీ. ఆ సినిమాలో కాస్త పద్దతిగానే కనిపించింది ఆకాంక్ష. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ భామకు పెళ్లైపోయింది కూడా. 2013లోనే తన బాయ్ ఫ్రెండ్ కునాల్ సైన్ తో ఏడడుగులు నడిచింది ఆకాంక్ష సింగ్.
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది ఈ భామ. తన కెరీర్ కు భర్తే దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెబుతుంది ఆకాంక్ష. ఇక ఈ మధ్యే అదిరిపోయే హాట్ హాట్ షో ఒకటి చేసింది ఈ భామ. దీనికి కూడా భర్త నుంచి పర్మిషన్ వచ్చిందని చెబుతూ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు కూడా షూటింగ్స్ లో కాస్త గ్యాప్ దొరకడంతో హాట్ షో చేసింది ఆకాంక్ష. తెలుగులో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆకాంక్ష సింగ్ కెరీర్ ఎటూ కాకుండా ఉంది. ప్రస్తుతం కన్నడలో సుదీప్ హీరోగా నటిస్తున్న పహిల్వాన్ లో జోడీకట్టింది ఈ ముద్దుగుమ్మ. దానికితోడు హిందీ సీరియల్స్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అవకాశం వచ్చినపుడు మళ్లీ తెలుగుకు రావాలని చూస్తుంది ఆకాంక్ష. మరి ఈ కాంత కాంక్ష ఎప్పటికి తీరుతుందో చూడాలి.