English   

సుజీత్ తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో తెలుసా..

sujeeth
2019-09-03 18:15:31

హిట్ సినిమా తీసాడా ఫ్లాప్ సినిమా తీసాడా అనేది పక్కన పెడితే 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమా తీసి ఔరా అనిపించాడు సుజిత్. షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో ఐదేళ్ల కింద రన్ రాజా రన్ సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ దర్శకుడు. ఆ ఒక్క సినిమా అనుభవమే ఇప్పుడు ఈయన నుంచి సాహో వచ్చేలా చేసింది. దీనికి టాక్ ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే ఇంత చిన్న వయసులో అంత పెద్ద సినిమా చేసి జాతీయ వ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు సుజీత్. ప్రస్తుతానికి టాక్ తో పనిలేకుండా సాహో సంచలన వసూళ్లు తీసుకొస్తుంది సాహో. వరుసగా నాలుగు రోజులు వీకెండ్ రావడంతో భారీ కలెక్షన్లు తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇప్పటికే 300 కోట్ల క్లబ్బులో చేరిపోయింది సాహో. దాంతో ఈ కుర్ర దర్శకుడు తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరోసారి భారీ సినిమా చేస్తాడా లేదంటే చిన్న సినిమాతో సరిపెట్టుకుంటాడా అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి ఇంత భారీ సినిమా ఇచ్చి ప్రభాస్ అనవసరంగా తప్పు చేశాడు అంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్న తరుణంలో.. తర్వాత సినిమా ఏమై ఉంటుందా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీనికి సమాధానంగా సుజిత్ ఒక చిన్న సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఎలాగైతే మగధీర తర్వాత రాజమౌళి చాలా తెలివిగా సునీల్ తో మర్యాదరామన్న చేశాడో.. అలాగే తాను కూడా అలాంటి భారీ సినిమా తర్వాత ఒక చిన్న సినిమా చేయాలని ఉన్నట్లు మనసులో మాట బయట పెట్టాడు సుజిత్. అయితే ప్రస్తుతం సాహో సందడిలో ఉన్నాను కాబట్టి ఇదంతా పూర్తయిన తర్వాతే తర్వాతి సినిమా కోసం కథ సిద్ధం చేస్తాను అంటున్నాడు. మరి మొత్తానికి చూడాలి ఈ కుర్ర దర్శకుడి తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో.

More Related Stories