English   

ఆ రూమర్స్ చెక్ పెట్టేందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీనా

slipa
2019-09-04 05:36:26

బిగ్ బాస్ 3 రియాలిటీ షో గురించి అ షో ద్వారా వచ్చే వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని వివాదాలు ఎదురైనా ఈ షో మీరంత సక్సెస్ ఫుల్ గా నడుస్తూనే ఉంది. ఇక ఈ షోలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ లలో శ్రీముఖి ఫస్ట్ ప్లేసులో ఉంటుదని బిగ్ బాస్ చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది. ఆమె గేమ్ ఆడడం కానీ.. గేమ్ లో తను ప్లే చేసే స్ట్రాటజీలు కానీ టైటిల్ గెలిచేందుకే అనేలా ఉంటాయి. ఇక ఆమెకు మొదటి నుండి బిగ్ బాస్ సహకరిస్తున్నాడు అనే ప్రచారం ఉండనే ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో సెలెబ్రిటీని ఎంటర్ చేశారు.

అయితే సరికొత్త పద్దతి ద్వారా కాసేపు  శిల్ప కనిపించకుండా గేమ్ ప్లే చేసిన బిగ్ బాస్ ఎట్టకేలకు శిల్ప ను హౌస్ లోకి పంపి టెన్షన్ పెట్టాడు. బిగ్‌బాస్‌ నిర్వాహకులు శ్రీముఖికే సపోర్ట్‌ చేస్తున్నారని వేరే కంటెంస్టెంట్స్ ని మద్దతు ఇచ్చే వారు ఆరోపణలు చేస్తున్నారు. ఆమెకు ఫేవర్‌గానే బిగ్‌బాస్‌ నడుచుకుంటోందనే విధంగా ఆమె చెప్పిన వారు ఎలిమినేట్ కావడం వంటివి ఊతం ఇస్తున్నాయి. దీంతో శ్రీముఖిని కంట్రోల్ చేయడానికి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా మరో యాంకర్ ను పంపించారని అంటున్నారు. అందుకే ఇంట్లోకి వచ్చిన వెంటనే నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఆమె శ్రీముఖి పేరు చెప్పడం కూడా అందుకే అయి ఉంటుందని భావిస్తున్నారు.  చూద్దాం ఇందులో నిజం ఎంతుందో ?

More Related Stories