English   

ముంబైలో మెరిసిన గీతగోవిందం...ఎంట్రీ కోసమా ?

vijayd
2019-09-04 20:08:28

ఛలో సినిమాలో మూవీతో తెలుగు తెరకి పరిచయమైన రష్మిక మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో నటించిన గీత గోవిందం మూవీ బంపర్ హిట్ కావడంతో ఆమె క్రేజీ హీరోయిన్ గా మారింది. స్వతహాగా కన్నడ నటి అయిన ఆమె ఈ రెండు ఇండస్ట్రీలలో సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ విజయ్ తో చేసిన డియర్ కామ్రేడ్ దెబ్బ వేసినా ప్రస్తుతం రష్మీక చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. మహేశ్ బాబు, నితిన్, కార్తీ అలాగే కొన్ని కన్నడ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇప్పడు తాజాగా ఆమె బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నట్టు బుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం తెలుగులో విజయవంతమైన `జెర్సీ` మూవీ బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్న సంగతి తెల్సిందే.

దిల్ రాజు అల్లు అరవింద్ కలసి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారు. ఇందులో కూడా తాజాగా తెలుగు రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో హిట్ కొట్టిన షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారట. ఇందులో హీరోయిన్‌గా రష్మికను నటింప చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే  చర్చలు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈరోజు ఆమె విజయ్ తో కలిసి ముంబై లో ఒక ఈవెంట్ లో పాల్గొంది. వారిద్దరూ కలిసి నటించిన డియర్ కామ్రేడ్ సినిమాని పీవీఆర్ సినిమాస్ అలాగే ఆమెజాన్ ప్రైం కలిసి ఒక ప్రీమియర్ ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడో నెల క్రితం రిలీజయిన సినిమాకి ఇప్పుడు పబ్లిసిటీ ఏమిటో వారికే తెలియాలి.

More Related Stories