English   

మీకు అండగా నేనుంటనన్న పవన్

pk
2019-09-04 20:25:06

సినిమాని వదిలి రాజకీయాల్లో బిజీ అయిన పవన్ సినిమా వాళ్ళను మాత్రం వదలలేను అంటున్నారు. సమస్య ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానని పవన్ మరో సారి నిరూపించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ –  చిత్రపురి కాలనీలో ఇళ్ళ కోసం పోరాడుతున్న కార్మికులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చిన చిత్రపురి సాధన సమితి సభ్యులు ఇళ్ళ పంపిణీ విషయమై తాము ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ ముందుంచారు. ఇండస్ట్రీలోని 24 విభాగాల్లో తాము పనిచేస్తున్నా తమకు దక్కని ప్లాట్స్ చిత్రపురిలో ఇతరులకు దక్కుతున్నాయని వారు పవన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.

తాము ఈ విషయమై పోరాడినా న్యాయం జరగలేదని అందుకే మీ వద్దకి ఈ సమస్య తెచ్చామని వారు పవన్ తో పేర్కొన్నారు. అంతే కాక బయట వారికి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించినవారికి సినిమా పని దొరక్కుండా చేసి వేధిస్తున్నారని వారు పవన్ దృష్టికి తీసుకెళ్ళారు. అయితే వారి సమస్యలను విన్న పవన్ ఈ విషయంలో చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ఇతరులతో మాట్లాడుతామనీ, జనసేన పార్టీ ఆర్టిస్టులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. టాలీవుడ్ పెద్దలు ఎన్.శంకర్, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజలతో తాను మాట్లాడుతానని హామీ ఇచ్చినట్టు సమాచారం.

More Related Stories