English   

ఆ లిస్టులో చేరిన రామ్

ram
2019-09-04 20:56:44

ఈ మధ్య తెలుగు సినిమాలకి బాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తోంది. కొన్ని సినిమాలని రీమేక్ చేస్తుండగా మరికొన్నిటిని మాత్రం హిందీ డబ్బింగ్ చెప్పించి డిజిటల్  ప్లాట్ ఫారంలలో విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా రామ్ నటించిన మూడు సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ సాధించి అద్భుతమైన రికార్డు సొంతం చేసుకున్నాయి. రామ్ నటించిన నేను శైలజ హిందీలో సూపర్ ఖిలాడీ3, హలో గురు ప్రేమ కోసమే హిందీలో దందార్ ఖిలాడీ, ఉన్నది ఒక్కటే జిందగీ హిందీలో నెంబర్ 1 దిల్వాలా సినిమాలు డబ్బింగ్ అయ్యాయి.

నిన్నటితో నెంబర్ 1 దిల్వాలా కూడా 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకోగా, మొత్తం ఈ మూడు సినిమాలతో 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. యూట్యూబ్ లో ఇప్పటికే తమిళం నుండి ధనుష్, తెలుగు నుండి సైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక రామ్ ఈ మధ్య పూరీ తో కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కూడా హిందీలో రీమేక్ చేయనున్నారని ప్రచారం కూడా జరిగింది. మరి అప్పటి దాకా ఆగుతారో లేక ఈ సినిమాని కూడా డబ్బింగ్ వర్షన్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తారో వేచి చూడాలి మరి.

More Related Stories