English   

బీజేపీలో చేరిన వివాదాస్పద యాంకర్

swetha
2019-09-04 21:40:08

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్‌గా ప్రయత్నించి చివర్లో భంగపడ్డ యూట్యూబ్ యాంకర్ శ్వేతా రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్‌పై చేయని రచ్చంటూ లేదు. అయితే నిన్న మొన్నటి దాకా యూట్యూబ్ లో తప్ప ఎవరికీ పరిచయం లేని ఆమె ఇటీవలే బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసి వైరల్ గా మారింది. షో నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేసిన ఆమె నాగార్జునపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా శ్వేతా రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కన్నాలక్ష్మీ నారాయణ సమక్షంలో ఈరోజు ఆమె బీజేపీలో చేరారు.

ముందు నుండీ పెద్దగా మీడియా ఫోకస్ లేని ఈమె గత ఎన్నికల్లో కేఏ.పాల్ పై టిక్కెట్ల అమ్మకం ఆరోపణలతో ఒక్క సరిగా మీడియా ముందుకు వచ్చారు శ్వేతారెడ్డి.  ఆ తర్వాత బిగ్ బాస్ షోలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ సంచలనాలకు తెరలేపి మీడియాలో పాపులర్ అయ్యింది. షో కోసం జరిగే ఎంపిక విషయంలో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి తెలుగు మీడియా ఛానెల్స్ లోనే కాక నటి గాయత్రి గుప్తాతో కలసి ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేసింది ఈమె. ఇక తాజాగా శ్వేతా రెడ్డి బీజేపీలో చేరడంతో నెటిజన్లు రకరకాల విధంగా స్పందిస్తున్నారు.

 

More Related Stories