English   

సంగీత దర్శకుడికి యాక్సిడెంట్...మానవత్వం చాటుకున్న తేజూ

teja
2019-09-04 21:59:50

యువ సంగీత దర్శకుడు తెలుగు, తమిళ, మళయాళ సినిమాలకి పని చేసిన అచ్చుకి భారీ యాక్సిడెంట్ అయ్యింది. అయితే అదృష్టం కొద్దీ అదే సమయానికి నటుడు సాయి సాయి ధరమ్ తేజ అదే రోడ్డులో వెళుతూ చూసి ఆగిపోయాడు. ఈ ఘటనకి సంబందించి పూర్తి వివరాల్లోకి వెళితే తేజూ నానక్ రాంగూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 42 ఎండింగ్ లో ఓ వ్యక్తి నడుపుతున్న కాస్ట్ లీ ఇంపోర్టెడ్ బైక్ అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి సుమారు 10 అడుగుల దూరం ఎగిరిపడ్డాడు.

అదే సమయంలో వెనుక నుంచి కారులో వస్తోన్న సాయి ఈ హఠాత్పరినామానికి కారును ఆపి కిందకి దిగాడు. దగ్గరికి వెళ్లి చూడగా ప్రమాదానికి గురైన వ్యక్తి తన స్నేహితుడు, సంగీత దర్శకుడు అచ్చు అని గుర్తుపట్టి తక్షణమే తన కారులో సమీపంలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో అచ్చుకు కాలుకు తీవ్రగాయం కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ తతంగాన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వైరల్ అయ్యింది.

More Related Stories