English   

అసలేంటీ చీప్ స్టార్ కధాకామామిషు

ajay
2019-09-04 22:19:01

‘ఆర్‌ఎక్స్‌ 100’ అనే చిన్న సినిమా భారీ హిట్ కొట్టిన తర్వాత చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ దర్శకుడు అజయ్‌ భూపతి పేరు విపరీతంగా వినిపించింది. ఆయన నితిన్ తో సినిమా చేస్తారంటూ జోరుగా వార్తలు వినిపించాయి. అవి  నిజం కాగ పోగా ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తారని అన్నారు. మహాసముద్రం టైటిల్‌తో అజయ్‌ భూపతి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, ఇదొక మల్టీస్టారర్‌ సినిమా అని ఇందులో ఓ కథానాయకుడిగా నటించేందుకు బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ అంగీకరించాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అవేవే కాకుండా ఆయన రవితేజతో ఈ సినిమా చేస్తున్నారని ప్రచారం జరిగింది.

ఈ సినిమాలో రవితేజతో పాటుగా హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్నారని ఈ సినిమా మీద అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. విశాఖపట్నం సముద్ర తీరంలో స్మగ్లింగ్‌ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని రవితేజకు జోడీగా అదితీరావ్‌ హైదరీ కనిపించనున్నారని, అక్టోబర్‌లో షూట్ కూడా ప్రారంభం కానుందని ప్రచారం జరిగింది. అయితే వీటిలో ఏదీ అధికారికంగా ఖారు కాకుండానే అజయ్ భూపతి చీప్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంసంగా మారింది. అయితే ఆ సినిమా కథ ఓకే చేశాక రవితేజ క్యాన్సిల్ చేశాడని అందుకే అజయ్ భూపతి ఇలా చీప్ స్టార్ అని పోస్ట్ చేశాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఆయన నోటితో చెబితేనే తెలుస్తుంది.

More Related Stories