English   

బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇలియానా

chiru
2019-09-05 07:41:55

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక జోరు ఎక్కువయింది. దాదాపు తొమ్మిదేళ్ల లాంగ్ పొలిటికల్ గ్యాప్ తీసుకున్న చిరుకి కొత్త జోష్ వ‌చ్చినట్టయింది. అందుకే ఇప్పుడు వ‌ర‌స చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారాయన. ప్ర‌స్తుతం చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ పూర్తికాగా నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుంటోంది. ఇక ఈ సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత  కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. చిరంజీవి బర్త్ డే రోజు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానుందని అనుకున్నా అది కుదరలేదు. ఈ సినిమా కోసం చిరంజీవి కేరళకు వెళ్లి బరువు తగ్గే పనిలో ఉన్నాడనీ కూడా ప్రచారం జరిగింది.

 అందులో నిజం ఎంతుందో తేలీదు కానీ ఆయన కోడలి మ్యాగజిన్ కోసం ఆయన ఇచ్చిన ఫోటోషూట్ లో ఆయన బక్క చిక్కి కనిపించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అంటూ నయనతార, అనుష్క, కీర్తిసురేష్‌, తమన్నా, కాజల్‌ వంటి తదితరుల పేర్లు బాగా వినిపించాయి. ఒకరి తర్వాత మరొకరి పేరు ప్రచారం జరిగినా ఇప్పటికీ ఈ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా అందరిని ఆశ్చర్య పరుస్తూ ఫేడవుట్ అయిన ఇలియానా పేరు వినిపించింది. చిరు సరసన మెయిన్‌ లీడ్‌గా ఆమెని ఎంపిక చేసే ఆలోచనలో యూనిట్ ఉందని అంటున్నారు. గతేడాది తెలుగులో 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం హిందీలో 'పాగల్‌పంటి'లోనూ నటిస్తోంది.  ఈ వార్తా నిజమే అయితే ఇలియానాకిది బంపర్‌ ఆఫర్‌ అనే చెప్పాలి.

More Related Stories