English   

హమ్మయ్య గుమ్మడికాయ కొట్టేశారు

harish
2019-09-05 08:10:05

మెగా హీరో వ‌రుణ్ తేజ్, కన్నడ బ్యూటీ పూజా హెగ్దే లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ‘వాల్మీకి’. తమిళ హిట్ సినిమా జిగార్తాండాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సింహ భాగం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కూడా సిద్దం అవుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా, తమిళ నటుడు అధర్వ మురళి రచయితగా నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 13న రిలీజ్‌ చేయాలని అనుకున్నా నాని గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వెన్నక్కి వెళ్ళింది. ఒక వారం లేట్ గా ఇరవయ్యో తారీఖున ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి నిన్నటితో గుమ్మడి కాయ కొట్టినట్టు చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు.

షూటింగు చివరి రోజున అంటే నిన్న బ్రహ్మానందం తదితరులపై కొన్ని సీన్స్ తెరకెక్కించారట. ఇక షూట్ గ్యాప్ లో కామెడీ కింగ్ కి  దర్శకుడు హరీశ్‌ శంకర్‌ స్వయంగా భోజనం వడ్డించారట. ఆ ఫొటోను హరీష్ శంకర్ ట్వీట్‌ చేశారు. ''ఎంతమందికో ఈ అదృష్టం. సినిమాకు రుణపడి ఉంటాను. 'వాల్మీకి'లో సర్‌ప్రైజ్‌లు చాలా ఉన్నాయి'' అని హరీశ్‌ శంకర్‌ పేర్కొన్నారు. ఇక దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించినట్టు సమాచారం. ''వాల్మీకి'లో సుక్కు (సుకుమార్‌)ది చిన్న సర్‌ప్రైజ్‌ ఉంటుంది'' అని మొన్న ట్వీట్‌ చేశారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

More Related Stories