English   

ధనుష్ పై మండిపడుతున్న తమిళ నిర్మాతలు.. 

 Dhanush
2019-09-05 13:10:04

ధనుష్ ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటున్నాడు. మొదట్లో ఈయన తన సినిమాలు.. తాను అన్నట్లు ఉండేవాడు కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా మారిపోతున్నాడు. ఒకప్పుడు సైలెంట్ గా కనిపించిన ఈ హీరో ఇప్పుడు కాంట్రవర్సీల్లో తల దూరుస్తున్నాడు. ఇప్పుడు ఈయన మాటలు కొన్ని తమిళనాట సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా నిర్మాతల నుండి డబ్బులు రాబట్టుకోవడం కొందరు నటులకు కష్టంగా మారుతుందని చెప్పాడు ధనుష్. ఓ సినిమా పూర్తైన తర్వాత కూడా కొందరు నిర్మాతలు రెమ్యూనరేషన్స్ సరిగ్గా ఇవ్వడం లేదని చెప్పాడు ధనుష్. దాంతో ఈయన మాటలపై ఇప్పుడు తమిళ నిర్మాతలు గుర్రుగా ఉన్నారు. నటులకు పారితోషికం విషయంలో నిర్మాతలు కూడా కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని ఆయన తెలిపాడు. దాంతో ధనుష్ పై ఇప్పుడు తమిళనాట పెద్ద యుద్ధమే జరుగుతుంది. అసలు ధనుష్ నిర్మాతల హీరో కాదని ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. నిర్మాతలతో ఆయన సరిగ్గా ఉండడని.. షూటింగ్స్ కు కూడా సరిగ్గా రాడని ఆయనపై రివర్స్ అటాక్ చేస్తున్నారు నిర్మాతలు. ఆయనతో సినిమాలు నిర్మించిన కొందరు ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయారని అంటున్నారు. నిర్మాతలు నటులకు డబ్బులు ఇవ్వడం లేదనేది అబద్ధమని.. నటీనటులకి సరైన సమయంలోనే డబ్బు చెల్లిస్తున్నామని చెబుతున్నారు నిర్మాతలు. తమిళనాట స్టార్ హీరోలైన అజిత్, విజయ్ లాంటి వాళ్లు నిర్మాతల బాగోగుల గురించి ఆలోచిస్తారని.. కానీ ధనుష్ కి అవేం పట్టవంటున్నారు వాళ్లు. ధనుష్ ప్రస్తుతం ఎనైనోకి పాయం తోట సినిమాతో రానున్నాడు. రెండేళ్లుగా విడుదలకు నోచుకోని ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది. గౌతమ్ మీనన్ దీనికి దర్శకుడు. 

More Related Stories