English   

సమంత అక్కినేని ఆ దర్శకులతో ఆడుకుంటుందా..

Samantha
2019-09-05 16:35:44

సమంత అక్కినేనికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ఏమని చెప్పాలి. ఈమె కోసం నిర్మాతలు ఇప్పటికీ క్యూ కడుతున్నారు. పెళ్లైన తర్వాత కూడా ఓ హీరోయిన్ కు ఇంత పాపులారిటీ ఉండటం మాత్రం తెలుగులో ఇదే తొలిసారి. కొన్ని దశాబ్ధాలుగా ఏ హీరోయిన్ కూడా పెళ్లి తర్వాత ఇంత స్టార్ డమ్ అనుభవించలేదు. ఇప్పుడు సమంత అది చేసి చూపిస్తుంది. ఈమెతో సినిమా చేస్తే నిర్మాతలకు లాభాలపంట పండుతుందని భావిస్తున్నారు. అందుకే సమంతతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. పైగా సమంత సినిమాలో ఉండి లేడీ ఒరియెంటెడ్ సబ్జెక్ట్ చేస్తే 20 కోట్ల వరకు థియెట్రికల్ బిజినెస్ తో పాటు మరో 15 కోట్ల వరకు శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ వస్తున్నాయి. అంటే కనీసం 35 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. దాంతో ఇప్పుడు సమంత అక్కినేని డేట్స్ కోసం ఎగబడుతున్నారు నిర్మాతలు. కానీ ఈమె మాత్రం తనకు చెప్పే ప్రతీ కథలో కూడా వేలు పెడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కుర్ర దర్శకులు కథలు చెప్పడానికి వెళ్తే తిరిగి వాళ్లకు ఈమె కథలు చెబుతుందనే ప్రచారం జరుగుతుంది ఇండస్ల్రీలో. ముఖ్యంగా ఓ బేబీ, సూపర్ డీలక్స్ లాంటి కథలు కావాలని సమంత కండీషన్ప్ పెడుతుండటంతో ఏం చెప్పాలో అర్థం కాక దర్శకులు కూడా పరేషాన్ అవుతున్నారని తెలుస్తుంది. మరి ఈమె సమంత చేస్తున్న బెట్టు చూసి ఆమెకు నచ్చే కథలు ఒప్పించే దర్శకులు ఎక్కడున్నారో..? 

More Related Stories